సినిమాల్లోకి సోషల్‌ మీడియా సెన్సేషన్‌… గీతా ఆర్ట్స్‌లోనే తొలి సినిమా!

  • July 5, 2024 / 02:32 PM IST

నిహారిక ఎన్‌.ఎం.. ఇలా ఓ మనిషి గురించి చెబితే గుర్తుపట్టడం కష్టమే. అయితే మీరు సోషల్‌ మీడియాను బాగా ఫాలో అవుతూ, సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు అయితే ఆ అమ్మాయి ఎవరో ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే తెలుగు సినిమా రిలేటెడ్‌గా ఆమె చేసే సోషల్‌ మీడియా వీడియోలు అంత వైరల్‌ అవుతుంటాయి మరి. ‘మేజర్‌’ (Major) , ‘లైగర్‌’ (Liger) సినిమా సమయంలో ఆమె టాలీవుడ్‌ జనాలకు బాగా సుపరచితమైపోయింది. ఇప్పుడు, గుర్తొచ్చిందా అడివి శేష్‌తో (Adivi Sesh) గొడపవడి..

మహేష్‌ బాబును (Mahesh Babu) చూసి బ్లాంక్‌ అయిపోయిన అమ్మాయి గుర్తుందా? విజయ్‌ దేవరకొండతో (Vijay Devarakonda) బాక్సింగ్‌ చేద్దామని రెడీ అయి బాడీ చూసి ఫ్లాట్‌ అయిపోయి ఆ అమ్మాయి గుర్తుందా? ఇవే కాదు బాలీవుడ్‌లో చాలామంది హీరోలతో అలాంటి ప్రమోషన్‌ వీడియోలు చాలానే చేసింది. యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో ‘వియర్డ్‌ డేట్‌’ అంటూ మరో వీడియో కూడా చేసింది. ఇప్పుడు ఈమె గురించి ఎందుకింత ఉపోద్ఘాతం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లోకి వస్తోంది.

గీతా ఆర్ట్స్ ద్వారా టాలీవుడ్‌లోకి నిహారిక ఎంట్రీ ఇస్తోంది. కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారికకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ గీతా ఆర్ట్స్ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీంతోపాటు ఆమెతో ఆ సంస్థ ఓ సినిమా చేస్తోందని కన్‌ఫామ్‌ కూడా చేశారు. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. కాలిఫోర్నియాలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద ఆసక్తితో పదో తరగతితోనే యూట్యూబ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయింది.

ఆ తర్వాత క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్‌టైన్మెంట్‌ కమ్‌ కామెడీ జోనర్‌లో క్వీన్ అయిపోయంది. అయితే ఇప్పుడు ఆమె ఏ సినిమాలో నటిస్తోంది అనే విషయాలను గీతా ఆర్ట్స్‌ వెల్లడించలేదు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమానా? లేక హీరోయిన్‌గా సినిమా చేస్తోంందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సోషల్‌ మీడియా నుండి మనకు మరో హీరోయిన్‌ దొరికేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus