Geetu: నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు.. పుష్ప 2 పై గీతూ కామెంట్స్!

  • November 13, 2022 / 06:29 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన గీతూ రాయల్ ఫైనల్ వరుకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే ఊహించనీ విధంగా ఈమె 9వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విధంగా ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడమే కాకుండా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి నా దగ్గర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి

గీతూ తన ఎలిమినేషన్ గురించి అలాగే తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈమె ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను పి ఆర్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల త్వరగా బయటకు వచ్చానని, ఇక నేను ఓడిపోవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కారణమని తెలిపారు. బిగ్ బాస్ 6 గెలిచే అర్హత కేవలం ఆది రెడ్డికి, రేవంత్ కు మాత్రమే ఉందని చెప్పారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇనయ లేకపోతే కంటెంట్ ఉండేది కాదేమోనని తెలిపారు. ఆమె కూడా టాప్ ఫైవ్ లో ఉంటుందని గీతూ తెలిపారు. ఇకపోతే తనకి పుష్ప 2సినిమాలో అవకాశం వచ్చింది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై కూడా ఈమె క్లారిటీ ఇచ్చారు.

పుష్ప 2లో అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఎవరు నన్ను సంప్రదించలేదని కాకపోతే పుష్ప కో డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారనీ ఈమె వెల్లడించారు.ఇక తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి కూడా ఈమె తెలియజేస్తూ తనకు రాజకీయాలపై ఎప్పటికైనా రాజకీయాలలోకి ప్రజలకు సేవ చేయాలనేదే తన కోరిక అంటూ ఈ సందర్భంగా గీతం తన గురించి వెల్లడించారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus