సినిమాలో క్యారెక్టర్ పేరుతో హీరోయిన్‌ను పిలుస్తున్నారు అంటే… ఆ పాత్రలో ఆమె జీవించేసింది అని అర్థం. అలా హా హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది జెనీలియా. ‘బొమ్మరిల్లు’లో ఆ పాత్ర చేసిందామె. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. ఆఖరి 2012లో ‘నా ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. మళ్లీ ఇప్పుడు అంటే పదేళ్లకు మరో సినిమా సైన్ చేసింది జెనీలియా. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న గాలి కిరీటి సినిమాలో జెనీలియా నటిస్తోంన్న విషయం తెలిసిందే.
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటిని పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇటీవల హీరోను పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అలాగే ముహూర్తపు షాట్ కూడా తీశారు. ఆ కార్యక్రమానికి జెనీలియా కూడా వచ్చింది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని సమాచారం. దీని కోసం జెనీలియాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ డేట్స్ తీసుకున్నారట.
జెనీలియా హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు మ్యాక్స్ ₹70 లక్షలు అందుకుందని అనేవారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా ₹3 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు. పాత్ర కీలకం కావడంతో నిర్మాత కూడా వెనుకంజ వేయకుండా ఓకే అనేశారట. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి అయినా… అంతా నడిపించేది గాలి జనార్దన్ రెడ్డినే అనేది సోషల్ మీడియా టాక్. జెనీలియా సినిమాలు మానేసిన నాలుగేళ్లకు హిందీలో అతిథి పాత్రలు పోషిస్తూ వచ్చింది.
సల్మాన్ ఖాన్ ‘జైహో’, ‘లాయ్ భారీ’, ‘ఫోర్స్ 2’, ‘మౌలి’ లాంటి చిత్రాల్లో అతిథిగా మెరిసింది. ఆ తర్వాత 2020లో ‘ఇట్స్ మై లైఫ్’ అనే సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించింది. ఇటీవల ‘వేద్’ అనే సినిమాతో మరాఠీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో ‘మిస్టర్ మమ్మీ’ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు గాలి కిరీటి సినిమాతో తెలుగు, కన్నడలో రీఎంట్రీ ఇస్తోంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!