ఎన్నో విలక్షణమైన పాత్రలు వేసి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న నటుడు.. గొల్లపూడి మారుతీరావు. ఈరోజు అనగా.. గురువారం.. చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన వయసు 80 ఏళ్ళు. 1939లో విజయనగరంలో గొల్లపూడి మారుతీరావు జన్మించారు. రైటర్ గా, నటుడు గా ఈయన చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. 13 ఏళ్ళ వయస్సులోనే ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేశారు. 250 కు పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ఈయన 6 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో విలన్ మరియు సహా నటుడి పాత్రలు పోషించారు. చిరంజీవి గారితో ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘ఇజం’ లో ఈయన కనిపించారు. అలాగే ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన ‘జోడి’ ఈయనకి చివరి చిత్రమని చెప్పాలి. ‘ప్రేమ పుస్తకం’ చిత్రానికి గాను గొల్లపూడి మారుతీరావు మొదటి నంది అవార్డును అందుకొన్నారు.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!