“ది బి ఎఫ్ జి” చిత్రానికి పెరిగిన కలెక్షన్స్

  • August 3, 2016 / 07:24 AM IST

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వచ్చిన ఫాంటసి చిత్రం, ” ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)”. డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం జులై 29 న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది . ఈ చిత్రానికి శుక్ర, శనివారల కలెక్షన్స్ తో పోల్చుకుంటే సోమవారం కలెక్షన్స్ అధికంగా ఉన్నాయి.

ఈ చిత్రం లో ని గ్రాఫిక్స్ అటు పిల్లలను ఇటు పెద్దవారినీ ఆకర్షిస్తున్నాయని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి తెలిపారు. విడుదలైన అన్ని భాషలలోను చక్కటి రివ్యూస్ అందుకుంటున్న ఈ చిత్రం కుటుంబ సమేతం గా చూడదగినది అని చిత్ర బృందం చెబుతోంది. స్నేహపూర్వమైన మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు.

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus