అనిల్‌ రావిపూడి – బాలయ్య సినిమా కాన్సెప్ట్‌ ఇదేనా? వింటుంటేనే గూస్‌బంప్స్‌ వస్తున్నాయిగా!

బాలకృష్ణకు సరైన క్యారెక్టరైజేషన్‌ పడితే.. ఆ సినిమాను అడ్డుకోవడం ఎవరితరమూ కాదు అంటుంటారు. ఇప్పటివరకు మాంచి విజయం అందుకున్న బాలయ్య సినిమాల్లో అతని క్యారెక్టరైజేషన్లు చూస్తే ఈ విషయం ఈజీగా చెప్పేయొచ్చు. ఇప్పుడు దాదాపుగా అలాంటి పాత్రతోనే సినిమా చేస్తున్నారు అనిల్‌ రావిపూడి. కమర్షియల్‌ అంశాలకు వినోదం జోడించి అందులో చిన్నపాటి సేప్‌ ప్రయోగం చేసి విజయాలు అందుకుంటున్నారు అనిల్‌ రావిపూడి. అందుకే ఆయన సినిమాల్లో ఫ్లాప్‌ కనిపించడం లేదు. తాజాగా ఇదే కాన్సెప్ట్‌లో బాలకృష్ణ సినిమాను కూడా రూపొందిస్తున్నారని టాక్.

బాలకృష్ణ 108వ సినిమాగా అనిల్‌ రావిపూడి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నందమూరి తారక రత్న అనారోగ్యం, మృతి నేపథ్యంలో ఈ సినిమా బాలయ్య గ్యాప్‌ ఇచ్చారు. మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమవుతుందని టాక్‌. ఈ క్రమంలో సినిమాలో కాన్సెప్ట్‌ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సినిమా ఎలా ఉంటుంది, బాలయ్య ఎలా కనిపిస్తాడు అనే విషయం ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పేశారు. అయితే ఇప్పుడొచ్చిన పుకార్లు వాటిని ఇంకాస్త వివరంగా చెప్పేవి అన్నమాట.

టాలీవుడ్‌ వర్గాలు, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ చిత్రం అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా తెలంగాణ మాండలికంలో మాట్లాడతారట. అలాగే బాలయ్య పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని సమాచారం. 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సీన్స్‌ చూసిన టీమ్‌ ఇదే ఫ్లో కొనసాగితే థియేటర్లలో గూస్‌బంప్స్ పక్కా అని అంటున్నారు.

సినిమా కథ విషయానికొస్తే.. 30 ఏళ్ల వయసులో ఆవేశంలో హీరో చేసిన ఓ తప్పునకు గాను శిక్ష పడుతుందట. ఆ తర్వాత అరవై ఏళ్ల వయసులో జైలు నుండి విడుదలైన హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, గతంలో ఏం జరిగింది అనేదే కథ. ఇక బాలయ్య పాత్ర పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. ఆ పాత్రలో చిన్న ఫన్నీ కాన్సెప్ట్‌ కూడా ఉంటుందట. ఇదంతా వింటుంటే బాలకృష్ణ గతంలో చేసిన ‘కృష్ణబాబు’ సినిమా గుర్తుకురావడం కొసమెరుపు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus