Chiranjeevi: సంక్రాంతి హిట్‌ దర్శకుడు చిరంజీవిని మెప్పించాడా?

  • March 2, 2023 / 02:46 PM IST

అభిమాని దర్శకుడిగా మారి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియాలి అంటే మొన్నీమధ్య సంక్రాంతికి వచ్చిన సినిమాల ఫలితాలు చూస్తే సరి. యువ దర్శకులతో సీనియర్‌ స్టార్‌ హీరోలు పొంగల్‌ ఫైట్‌కి వచ్చి విజయం సాధించారు. చాలా తక్కువసార్లే జరిగే ఇలాంటి స్టార్‌ వార్‌.. ఈ సంక్రాంతికి కనిపించింది. సినిమాలు విజయాలతో మెప్పించాయి కూడా. అయితే అందులో తన అభిమాన హీరోకు హిట్‌ సినిమా ఇచ్చిన డైరక్టర్‌ తన ఫ్రెండ్‌ ఫేవరేట్‌ హీరోతో సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

క్లారిటీ లేకుండా ఉంది కదా పైన అంతా. అవును విషయం కూడా ఇంచుమించు అలానే ఉంది. ఎందుకంటే ఇక్క కాంబినేషనే అలా ఉంది మరి. ఇంకా చెప్పాలంటే… బాలకృష్ణ దర్శకుడు త్వరలో బాబి హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు అర్థమైందిగా. బాలకృష్ణతో ‘వీర సింహా రెడ్డి’ అంటూ వీర విజయం అందుకున్న గోపీచంద్‌ మలినేని.. బాబి కొల్లితో కలసి ‘వాల్తేరు వీరయ్య’ అంటూ వచ్చి పూనకాలు తెప్పించిన చిరంజీవితో సినిమా చేస్తారట.

ఇటీవల గోపీచంద్‌ మలినేని చిరంజీవిని క‌లిసి.. ఓ కాన్సెప్ట్‌ చెప్పిన‌ట్టు సమాచారం. ఆ ఆలోచన నచ్చడంతో పూర్తి స్థాయి కథ సిద్ధం చేయమని అడిగారని అంటున్నారు. ప్ర‌స్తుతం చిరు ‘భోళా శంక‌ర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ త‌రవాత ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. నిజానికి ఆ సినిమా తర్వాత వెంకీ కుడుముల‌తో ఓ ప్రాజెక్టు చేయాలి. ఆ సినిమా ఉందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. మ్యగ్జిమమం లేదనే అంటున్నారు.

కాబట్టి చిరు నెక్స్ట్‌ సినిమా గోపీచంద్‌ మలినేనితోనే అని చెబుతున్నారు. వెంకీ కుడుముల సినిమా కూడా ఉంటే.. రెండూ పారలల్‌గా సాగుతాయని టాక్‌ కూడా నడుస్తోంది. గతేడాది కూడా చిరంజీవి ఇలానే రెండు పడవల ప్రయాణాలు భలేగా చేశారు. మరి ఈ ఏడాది కూడా అలాంటి పనే చేస్తారు అని అంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్‌కు కూడా ఆనందమే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus