Chiranjeevi: చిరంజీవితో బాలయ్య దర్శకుడి సినిమా.. వర్కౌట్ అవ్వుద్దా..!

  • March 1, 2023 / 08:52 PM IST

మెగాస్టార్త‌ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే టైంలో చిరు సినిమాకి పోటీగా బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ కూడా రిలీజ్ అయ్యింది. నిజానికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ కు ముందు వరకు ‘వీరసింహారెడ్డి’ హవానే ఎక్కువగా నడించింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘వీరసింహారెడ్డి’ పై ‘వాల్తేరు వీరయ్య’ పైచేయి సాధించింది. అయితే ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా ‘వీరసింహారెడ్డి’ నిలిచింది.

దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి మంచి పేరొచ్చింది. ఇతని గత చిత్రం ‘క్రాక్’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ఇతని పై అగ్ర హీరోలు ఇతని పై దృష్టి పెట్టారు. ఈ మధ్య కాలంలో తరచూ స్టార్ హీరోలకు కథలు చెబుతూ వస్తున్నాడు గోపీచంద్ మలినేని. తాజాగా ఇతను చిరంజీవిని కలిసి కథ వినిపించాడు. చిరుకి … గోపీచంద్ వినిపించిన కథ నచ్చింది. కానీ ఇంకా చిరు ఓ డెసిషన్ కు రాలేదు. ప్రస్తుతం చిరు `భోళా శంక‌ర్‌`తో బిజీగా ఉన్నారు.

ఆ త‌రవాత వెంకీ కుడుముల‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ వెంకీ… నితిన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దానిపై కూడా క్లారిటీ వస్తే… గోపీచంద్ మలినేనితో చిరు సినిమా ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది. గతంలో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు గోపీచంద్ మలినేని. అప్పటి నుండి చిరుతో టచ్ లోనే ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలను ఇంప్రెస్ చేయాలని గతంలో సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ చేశాడు.

అది ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు ‘పండగ చేస్కో’ సినిమా అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడు. కానీ అది సెట్ అవ్వలేదు. ‘భీమ్లా నాయక్’ ను డైరెక్ట్ చేసే అవకాశం ముందు ఇతనికే వచ్చింది. అది కూడా సెట్ అవ్వలేదు. ఒకసారి మెగా ఫ్యామిలీతో సినిమా చేసి హిట్ కొడితే తర్వాత ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోలంతా సినిమాలు చేయడానికి రెడీ అవుతుంటారు. మరి ఆ టైం గోపీచంద్ మలినేనికి వస్తుందో లేదో చూడాలి..!

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus