దర్శకుడు గోపీచంద్ మలినేని ‘క్రాక్’ తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. ఈ ఏడాది వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. అతని సినిమా అంటే స్టార్టింగ్ పోర్షన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. హీరో బిల్డప్ సీన్లు కామన్ గా పెడితే.. విలన్ కి పెట్టే సెటప్ అలాగే లేడీ క్యారెక్టర్లు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు శృతి హాసన్ తో ఓ ఫైట్ కూడా చేయించాడు గోపీచంద్ మలినేని.
ఏదో పాటలకి అన్నట్టు కాకుండా ఆ పాత్రకి మంచి కన్క్లూజన్ ఇచ్చాడు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర అయితే చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు. ‘వీరసింహారెడ్డి’ లో కూడా అంతే. కథ మొత్తం వరలక్ష్మీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గోపీచంద్ మలినేని నెక్స్ట్ మూవీ రవితేజతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైంది. తమన్ సంగీతం దర్శకుడు. ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు.
ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ చేయాలి. కాకపోతే ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో దర్శకుడు గోపీచంద్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాకి ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు కూడా వినికిడి. సెప్టెంబర్ నెల నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.