గోపీచంద్ కి ‘బల’మైన దెబ్బే తగిలింది…

  • October 25, 2016 / 10:18 AM IST

గతేడాది గోపీచంద్ నటించిన ‘సౌఖ్యం’ డిజాస్టర్ కావడంతో తనదైన శైలి యాక్షన్ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలని ‘ఆక్సిజన్’ సినిమాని మొదలెట్టాడు. తమిళ చిత్రాల నిర్మాత ఏ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ వ్యూహంతోనే సినిమా చివరి దశలో ఉండగా మొన్నామధ్య టీజర్ విడుదల చేసి తాము రేసులో ఉన్నామంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయిందట.

సినిమా చివరి పార్ట్ చిత్రీకరణలో దర్శకుడు జ్యోతికృష్ణకు గోపీచంద్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట. దర్శకుడితో విసిగివేసారిపోయిన గోపీచంద్ సెట్ నుండి బయటకు వచ్చేశారట. మరోవైపు ఈ గ్యాప్ ను పూడ్చేందుకు బి గోపాల్ తెరకెక్కించిన సినిమాని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవగా ఆ సినిమాకని అనుకున్న ‘బలం’ టైటిల్ ను హృతిక్ రోషన్ కొట్టేసి మరో దెబ్బ కొట్టాడు. ఇలా గోపి కెరీర్ కి బలమైన దెబ్బే తగిలింది. ఇప్పుడు సంపత్ నందితో చేస్తున్న మొదటి షెడ్యూల్ పూర్తయినా సినిమా విడుదలయ్యేసరికి ఎటూ వేసవి సీజన్ వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో గోపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus