విజయాలు లేకపోయినా, వసూళ్లు లేకపోయినా వరుస సినిమాలు చేయడంలో, కొత్త ప్రాజెక్ట్‌లు దక్కించుకోవడంలో గోపీచంద్ (Gopichand) ప్లానింగే ప్లానింగ్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా గ్లింప్స్‌ను టీమ్ రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లను నిజం చేస్తూ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ (Gopichand) ఈ సినిమా చేస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా గోపీచంద్ (Gopichand) కెరీర్‌లో 33వది. యోధుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అనేది గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
అంతకుమించిన సన్నివేశం గ్లింప్స్‌లో చూపించకపోయినా.. నేపథ్యం, నేపథ్య సంగీతం, గోపీ చంద్ (Gopichand)లుక్ సినిమాకు మంచి హైని తీసుకొచ్చాయి అని చెప్పాలి. ఇక సంకల్ప్ సినిమాల గురించి తెలిసినవాళ్లు ఈ సారి అంతకుమించిన భారీతనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గతంలో ఆయన తీసిన ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ భారీ కాన్వాస్‌తో రూపొందాయి. బాలీవుడ్‌కి వెళ్లి తీసిన ‘ఐబీ 71’ కూడా హెవీ యాక్షన్ సినిమానే. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పొచ్చు.
ఇక గోపీచంద్ (Gopichand) విషయానికొస్తే.. గత పదేళ్లలో ఆయన మంచి హిట్ లేదు. ‘జిల్’ (Jil) సినిమాతో స్టైలిష్ హిట్ అందుకున్నాక.. మధ్యలో ‘సీటీమార్’ (Seetimaarr)తో ఫర్వాలేదు అనిపించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పేరు వచ్చినా.. పైసలు రాలేదు. అలా ‘సౌఖ్యం’ (Soukhyam) , ‘గౌతమ్ నంద’ (Goutham Nanda) , ‘ఆక్సిజన్’ (Oxygen), ‘ఆరడుగుల బుల్లెట్’ (Aaradugula Bullet), ‘పంతం’ (Pantham) , ‘చాణక్య’ (Chanakya) , ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) , ‘రామబాణం’ (Ramabanam) , ‘భీమా’ (Bhimaa) , ‘విశ్వం’ (Viswam) వచ్చి వెళ్లిపోయాయి.