Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

దిల్ రాజు (Dil Raju)- అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో ‘ఆర్య'(Arya) ‘పరుగు’ (Parugu)  ‘ఎవడు’ (Yevadu) ‘డిజె  – దువ్వాడ జగన్నాథం’ (DJ: Duvvada Jagannadham) వంటి సినిమాలు వచ్చాయి. తర్వాత ‘ఐకాన్’ అనే ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడు అని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 7 ఏళ్ళు అయినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళింది లేదు. దానికి కారణం ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.

Dil Raju

దర్శకుడు వేణు శ్రీరామ్ పై నమ్మకం లేకపోవడం వల్లే ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. లేదు అది ‘బన్నీ గారికి బాగా నచ్చిన కథ.. కచ్చితంగా ఆ సినిమా ఉంటుంది’ అని బన్నీ వాస్ చెప్పాడు. తర్వాత దిల్ రాజు ‘కచ్చితంగా ‘ఐకాన్’ ఉంటుంది’ అని చెప్పారు. కానీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ అయ్యి హిట్ అయినా ‘ఐకాన్’ ప్రస్తావన రాలేదు.

 

దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అని అంతా ఫిక్స్ అయిపోయారు.మరోపక్క ‘ఐకాన్’ అనే టైటిల్… అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ సినిమా కోసం ఇచ్చేస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. మరోపక్క ‘ఆర్య 3’ టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయడంతో.. బహుశా టైటిల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ ‘పుష్ప’  (Pushpa)వల్ల ‘ఐకాన్’ డిలే అయ్యింది.

 

అందుకే దర్శకుడు వేణు ‘తమ్ముడు’ కథపై వర్క్ చేశాడు. 4 ఏళ్ళు ఈ సినిమాపైనే వర్క్ చేశాడు’ అంటూ చెప్పాడు. దిల్ రాజు (Dil Raju) మాటలను బట్టి చూసుకుంటే.. ‘ఐకాన్’ డిలే అయ్యింది అన్నారు కానీ ఆగిపోయింది అని చెప్పలేదు. సో దిల్ రాజుకి బన్నీతో ‘ఐకాన్’ చేయాలనే కోరిక ఎక్కువగానే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

డ్రగ్స్ కేసులోకి నన్ను లాగకండి.. దివి కామెంట్స్ వైరల్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus