అవికా గోర్ (Avika Gor) అందరికీసుపరిచితమే. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్ తో ఈమె తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘ఉయ్యాలా జంపాలా’ (Uyyala Jampala)తో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు బాగానే అవకాశాలు వచ్చాయి. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్త మావ’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (Ekkadiki Pothavu Chinnavada) ‘రాజు గారి గది 3’ వంటి సినిమాల్లో నటించింది. ఇవన్నీ బాగానే ఆడాయి అని చెప్పాలి.
ఇక ‘నెట్’ అనే వెబ్ మూవీతో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కానీ తర్వాత ఎందుకో ఈమెకి ఆఫర్లు తగ్గాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈమె సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చింది.
అవికా గోర్ (Avika Gor) తన చిరకాల ప్రియుడు, ప్రముఖ బిజినెస్మెన్ అయినటువంటి మిలింద్ చాంద్వానితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. దాదాపు 6 ఏళ్ళ నుండి ఇతనితో అవికా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సార్లు అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోలను ఆమె షేర్ చేయడం జరిగింది.మొత్తానికి అతనితో నిశ్చితార్థం చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పెద్దగా హడావిడి లేకుండా తక్కువ మంది సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగి ఉండవచ్చు అని ఆమె మాటలను బట్టి స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని పోస్ట్ చేసింది. అవి చూసిన వారు నూతన దంపతులకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.