Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!

ప్రముఖ టాలీవుడ్‌ గాయని మంగ్లీ (Mangli)  ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ రిసార్టులో ఆమె ఏర్పాటు చేసిన పార్టీలో విదేశీ మద్యం, గంజాయి సేవించారు అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు చాలా రకాల వాదనలు వినిపించాయి. అయితే బుధవారం రాత్రి మంగ్లీ  (Mangli) ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. అసలు అక్కడేం జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాలను ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

Mangli

చేవెళ్లలోని ఓ రిసార్టులో మంగ్లీ, (Mangli) తన కుటుంబ సభ్యులు, మిత్రులు పార్టీ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కూడా స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ విదేశీ లిక్కర్, గంజాయి లేవు అని ఆమె చెప్పారు. కేవలం లోకల్‌ మద్యాన్ని మాత్రమే అక్కడ ఉంచామని ఆమె తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా తన తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలసి పార్టీ చేసుకున్నట్లు ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే సన్నిహితులతో చేసుకునే పార్టీలో మద్యం కోసం అనుమతి తీసుకోవాలని తనకు తెలియకపోవడం వల్లే అలా జరిగిందని ఆమె చెప్పారు.

ఒక చిన్న ఇంట్లో పార్టీ చేసుకున్నాం. అమ్మానాన్న, ఫ్రెండ్స్, నా టీమ్‌ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అమ్మానాన్నను పక్కనపెట్టుకొని డ్రగ్స్ పార్టీలో ఉంచుతామా చెప్పండి అని అన్నారామె. అంతేకాదు అక్కడ పోలీసులకు కూడా ఆ ఆధారాలు దొరకలేదని కూడా స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు గతంలో ఎక్కడో గంజాయి తీసుకున్నారు అని తెలిసిందని మంగ్లీ తెలిపారు.

ఈ వ్యవహారంలో పోలీసులు విచారణ చేస్తున్నారని, అప్పుడు విషయం తేలుతుంది అని చెప్పారామె.సమాజంలో రోల్ మోడల్‌గా, ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలనుకుంటున్న తాను ఇటువంటి పనులు చేస్తానా చెప్పండి అంటూ ఆమె ప్రశ్నించారు. దయచేసి నిరాధార ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని మంగ్లీ రిక్వెస్ట్‌ చేశారు.

మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus