ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన టి.కృష్ణ గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే తన 8 వ ఏటనే తండ్రిని కోల్పోయాడు. సో అతనికి సినీ పరిశ్రమలో తెలిసిన వాళ్ళు ఉన్నారేమో కానీ.. పెద్ద ఫిలిం బ్యాక్ గ్రౌండ్ అయితే లేదు. అతను కూడా కొత్తగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు. హీరోగా చేసిన సినిమా దారుణంగా ప్లాప్ అయితే.. అతనికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరు.
అప్పుడు ‘జయం’ తో విలన్ గా చేసి మళ్ళీ హీరోగా మారాడు. హీరోగా పలు సక్సెస్ లు అందుకున్న గోపీచంద్.. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అయితే సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కరువుండదు. గోపీచంద్ ను కూడా బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది అంటూ అతని అభిమానులు అలాగే కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గోపీచంద్ ను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ మరేదో కాదు..
అతను గడ్డంతో కనిపించడమే అనేది కొందరు నెటిజన్లు అలాగే అభిమానుల వాదన. గోపీచంద్ కెరీర్ ప్రారంభం నుండి చూసుకుంటే ‘నిజం’ ‘రారాజు’ ‘ఒంటరి’ ‘గౌతమ్ నంద’ ‘చాణక్య’ వంటి సినిమాల్లో గోపీచంద్ గడ్డంతో కనిపించాడట. అందుకు ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయట. ‘పంతం’ ‘సీటీమార్’ వంటి సినిమాలు హిట్ అయినా బాక్సాఫీస్ వద్ద సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అదేనని వారు అంటున్నారు.
లేటెస్ట్ గా వచ్చిన ‘రామబాణం’ లో కూడా ఒకటి రెండు పాటల్లో (Gopichand) గోపీచంద్ గడ్డంతో కనిపించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అందుకే గోపీచంద్ అభిమానులు ఇలాంటి నెగిటివ్ లెక్కలు వేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది.