మహేష్ బాబుతో నటించిన ఈ పాప ఇప్పుడు క్రేజీ హీరోయిన్..!

  • November 28, 2022 / 06:03 PM IST

సోషల్ మీడియా కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి సంబంధించి అన్ని విషయాలూ తెలుస్తున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా సినిమాలు, స్టార్లకు సంబంధించిన రేర్ ఫ్యాక్ట్స్ లాంటివి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో హీరోయిన్ల చిన్నప్పటి పిక్స్ అయితే బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఓ చిన్నారి పిక్ వైరల్ అవుతోంది. ఆ పాప కోలీవుడ్, టాలీవుడ్‌లో కథానాయికగా సినిమాలు చేసింది. ఆ పాప ఎవరంటే.. శ్రీదివ్య.. ‘హనుమాన్ జంక్షన్’, ‘యువరాజు’, రవితేజ ‘వీడే’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.

రవిబాబు డైరెక్ట్ చేసిన ‘మనసారా’ మూవీతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ‘బస్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘కేరింత’, ‘వారధి’ వంటి సినిమాల్లో లీడ్ ఫీమేల్ రోల్స్ చేసింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తమిళనాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్టు శ్రీదివ్య సిస్టర్ శ్రీరమ్య కూడా కథానాయికే.. తెలుగు, తమిళ్‌లో సినిమాలు చేసింది. టాలీవుడ్ డెబ్యూ మూవీ ‘1940లో ఒక గ్రామం’ తో స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డ్ అందుకుంది.

‘విరోధి’, ‘అలియాస్ జానకి’ తర్వాత కోలీవుడ్‌లో ‘యమున’ అనే చిత్రం చేసింది. ఇక శ్రీదివ్య విషయానికొస్తే.. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘వరుతపడత వాలిబర్ సంఘం’ మూవీతో తమిళనాట కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అనుష్క ‘సైజ్ జీరో’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘బెంగుళూర్ డేస్’ తమిళ్ రీమేక్ ‘బెంగుళూర్ నాట్కల్‘, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ‘పెన్సిల్’,

విశాల్ పక్కన ‘మరుదు’, కార్తీతో ‘కాష్మోరా’, ‘రంగం’ ఫేమ్ జీవాతో ‘సంగిలి బుంగిలి కాదవ తొరయే’ లాంటి సినిమాలతో తమిళ్‌లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుని అక్కడే సెటిలైపోయింది. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, మమత మోహన్ దాస్ నటిస్తున్న ‘జనగణమన’ లో అతిథి పాత్రలో కనిపించనుంది. తెలుగులో ఏదైనా క్రేజీ ఆఫర్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నానంటోంది శ్రీదివ్య. ఆమె మహేష్ బాబుతో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus