Guntur Kaaram: ‘అల వైకుంఠపురములో’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న ‘గుంటూరు కారం’ మేకర్స్

Advertisement

ఇప్పుడు అందరి చూపు ‘గుంటూరు కారం’ సినిమా పైనే ఉంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన సినిమా ఇది..! జనవరి 12 న రిలీజ్ కాబోతుంది. అదే రోజున ‘హను-మాన్’ అనే క్రేజీ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దాని టీజర్, ట్రైలర్..లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. మరోవైపు ‘గుంటూరు కారం’ కి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరగడం లేదు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఈ కారణంతో మహేష్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మేకర్స్ అలర్ట్ అయ్యి ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ కి అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 6న అంటే శనివారం నాడు సాయంత్రం యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు అక్కడే నిర్వహించారు. అంతే కాదు ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అక్కడే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ‘అల వైకుంఠపురములో’ సెంటిమెంట్ గా ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం.

గెస్ట్..లు ఎవరొస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. అభిమానుల సమక్షంలోనే ఈ వేడుక జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అదే రోజున ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్ కూడా రిలీజ్ కానుండటం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus