టాలెంట్ ఎక్కడున్నా వెతికి అవకాశం ఇవ్వడంలో కిక్కే వేరు. ఇప్పుడు ఇలాంటి పనే చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్. తెలుగు వారికి జీవీతో ఎప్పటి నుండో పరిచయం ఉన్నా.. రీసెంట్ టైమ్స్‌లో మరోసారి తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారాయన. మరో ఎండ్‌లో సినిమాల్లో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ సోషల్ మీడియా చూస్తే.. అందులోని టాలెంట్‌ని ఫైండౌట్ చేస్తున్నారు.
మన ఊళ్లలో రోడ్ పక్కన కొంతమంది మైక్ సెట్ పెట్టుకుని పాటలు పాడే దివ్యాంగులను చూసే ఉంటారు. కొంతమంది శ్రావ్యమైన గొంతుతో పాటలు పాడుతుంటారు. అందులో ఎక్కువగా పాత, క్లాసిక్ పాటలే ఉంటాయి. మనకు బాగా తెలిసిన ఆ పాటల్ని వాళ్లలా పాడుతంటే కాసేపు అది రోడ్డని మరచిపోయి వింటుంటాం. అలా రోడ్డు మీద పాట పాడే ఒక టాలెంటెడ్ దివ్యాంగ గాయకుడి గురించి జీవీ ప్రకాష్ కుమార్ అడిగారు.
ఉత్తర భారత దేశంలో భార్య, బిడ్డలను పక్కన పెట్టుకుని హిందీ పాటలు పాడుతున్న ఒక దివ్యాంగ గాయకుడి వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ అలా అలా ప్రకాష్ వరకు చేరింది. దానిపై ఆయన స్పందిస్తూ.. ఇతనిది గొప్ప ప్రతిభ, కాంటాక్ట్ నెంబర్ దొరికితే నాకు పంపించండి అంటూ జీవీ కోరారు. ఎవరైనా ఆ సింగర్ ఫోన్ నెంబర్ ఇస్తే జీవీ తన సినిమాలో పాటలు పాడే అవకాశం ఇస్తారేమో చూడాలి.
అదే జరిగితే కొత్త ప్రతిభను, అందులోనూ ఇలాంటి దివ్యాంగుని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చెయ్యడంలో సోషల్ మీడియా పవర్ అర్థమవుతుంది. ప్రస్తుతం జీవీ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు వరకు చూస్తే.. ‘జనవరి 12 విడుదల’ పెద్ద సినిమా. వెంకటేశ్ – కల్యాణ్‌రామ్ – అనిల్ రావిపూడి – కీర్తి సురేశ్ – కృతి శెట్టి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలూ ఉన్నాయి..