H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

‘జన నాయగన్‌’ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా సెన్సార్‌ సమస్యల టాపిక్‌ కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏ సినిమాకు కూడా రాకూడని సినిమా కష్టాలు ఆ సినిమాకు వచ్చాయి. సెన్సార్‌కి వెళ్లడం, అక్కడి నుండి రివిజన్‌ కమిటీకి వెళ్లడం, ఈ లోపు కోర్టు మెట్లు ఎక్కడం.. ఇలా చాలానే జరిగాయి. ఫైనల్‌గా అనుకున్న టైమ్స్‌కి సినిమా సెన్సార్‌ అవ్వలేదు. దీంతో రిలీజ్‌ కూడా కాలేదు. ఇప్పుడు ఈ నెల 23న సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు హెచ్‌.వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

H vinoth

మామూలుగా మేం సినిమా విడుదలకు 10 రోజుల ముందు సెన్సార్‌ ముందుకెళ్తాం. ‘జన నాయగన్‌’ సినిమా విషయంలో 20 రోజుల ముందే వెళ్లాం. అంటే డిసెంబరు 19, 2025న సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లై చేశాం. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ బోర్డు సభ్యులు కొన్ని మార్పులు, కటింగ్‌లు చెప్పారు. ఇవి చేస్తనే యూ/ఎ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. వాటిని చేసి మళ్లీ సెన్సార్‌కి పంపించాం. ఈసారి మరికొన్ని మార్పులు, కట్స్‌ చెప్పారు. ఈ లోపు రిలీజ్‌ డేట్‌ దగ్గరకు వస్తోంది.

అదే సమయంలో శివకార్తికేయన్‌ ‘పరాశక్తి’ సినిమా సెన్సార్‌ ఇష్యూ నడుస్తోంది. ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా దగ్గర పడింది. ఏదోలాగా వారికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. కానీ ‘జన నాయగన్‌’ సినిమాకు రాలేదు. వస్తుందో రాదో అని నిర్మాత కోర్టును ఆశ్రయించారు. సినిమా రిలీజ్‌కి వేరే ఆప్షన్‌ లేకపోవడం వల్లే అలా చేశారు. నిర్మాత అలా చేసే సరికి రివైజింగ్‌ కమిటీ రివ్యూకి సినిమాను పంపిస్తున్నామని సెన్సార్‌ బోర్డు తెలిపింది. ఈ లోపు న్యాయ ప్రక్రియ మొదలైంది. దీంతో సినిమా సెన్సార్‌ అవ్వలేదు అని హెచ్‌.వినోద్‌ చెప్పారు.

దీంతో సినిమా విడుదలకు, సెన్సార్‌ నిర్మాత కోర్టును ఆశ్రయించడానికి ఏమైనా రిలేషన్‌ ఉందా అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

 ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus