సుమంత్ అక్కినేని ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరో. 2003 టైంలో సత్యం , గౌరీ వంటి మాస్ హిట్లు ఇచ్చిన వాడే. అలాగే గోల్కొండ హైస్కూల్, గోదావరి, మళ్ళీరావా వంటి డీసెంట్ హిట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి. అయితే యంగ్ హీరోల ఎంట్రీ తర్వాత సైలెంట్ అయ్యాడు. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. రూటు మార్చి అనగనగా అనే ఓటీటీ సినిమా చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా కూడా పర్వాలేదు అనిపించింది.
ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి'(Mahendragiri Varahi) అనే మిస్టిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్స్ కూడా నటించడంతో ఈ సినిమాపై ఆడియన్స్ దృష్టి పడింది. ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 11న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ తర్వాత డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| డే 1 | 0.55 cr |
| డే 2 | 0.69 cr |
| డే 3 | 0.62 cr |
| డే 4 | 0.59 cr |
| డే 5 | 0.29 cr |
| డే 6 | 0.24 cr |
| డే 7 | 0.22 cr |
| టోటల్ | 3.2 cr (షేర్) |
‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం 4 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ సినిమాని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. వాటి వాల్యూ ప్రకారం రూ.5 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది.