ఆకట్టుకుంటున్న ‘మధుర వైన్స్’ ఫస్ట్ సింగిల్..!

‘ఆర్.కె.సినీ టాకీస్’ అండ్ ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ సంస్థల పై రాజేష్ కోదెపు, కార్తీక్ శభరీష్ కలిసి నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘మధుర వైన్స్’. జయ కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సన్నీ నవీన్, సీమ చౌదరి… హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.. తాజాగా ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. జయ్ క్రిష్ సంగీతంలో రూపొందిన ఈ పాట ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి.

లిరికల్ సాంగ్ ప్రారంభానికి ముందు.. ‘ సమయం : రాత్రి 8 గంటలకు, స్థలం : గుంటూరు టౌన్.. మధురా వైన్స్ కు కొద్దిగా సమీపంలో, ఓ నాలుగు పేదలు 50 సెకన్లపాటు పోట్లాడి అలసిన వెచ్చని ఊపిరి నుండి వచ్చిన మైకంలో.. మళ్ళీ కాసేపటికి’… అంటూ పాట వచ్చే సందర్భాన్ని వివరించారు. ‘నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్’ అని హీరోయిన్ అడిగినప్పుడు.. ‘అదే ముద్దు పెట్టుకున్నాక ఏమి చెప్పకుండా వెళ్ళిపోయావు.. అసలు బావుందా.. బాలేదా… అసలు ఫీడ్ బ్యాక్ ఏంటా అని..? బాగోకపోతే చెప్పొచ్చు కావాలంటే మళ్ళీ ట్రై చేద్దాం’ అంటూ ఏరో జవాబివ్వడం చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ‘వెన్నెల కన్నుల రేయి.. ఎదో తెలియని హాయి’ అంటూ సింగర్లు అయిన జయ్ క్రిష్, శిల్పా నటరాజన్ లు అదే ఫీల్ ను క్యారీ చేస్తూ పాటను పాడారు. వినడానికి పాట చాలా వినసొంపుగా ఉంది. ఈ పాట కచ్చితంగా సినిమా పై అంచనాల్ని రెట్టింపు చేసేలా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా ఓసారి వినెయ్యండి.


ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus