Hansika: హన్సిక బ్యాచిలర్ పార్టీ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

  • November 28, 2022 / 05:24 PM IST

నార్త్ కు చెందిన బ్యూటీ అయినప్పటికీ తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హన్సిక. ప్రముఖ వ్యాపారవేత్త అలాగే ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అయిన సొహైల్ కతూరియాని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో హాన్సిక- సొహైల్ ల మ్యారేజ్ జరగబోతుంది. ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మధ్యనే వధూవరులు ఇద్దరూ కలిసి ఓ పూజలో పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

వాటిని అందరూ చూశారు కూడా.! ఇక బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనుండడంతో తన స్నేహితులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది హన్సిక. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో హన్సిక ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పార్టీలో హన్సిక చాలా గ్లామరస్ గా తయారైంది.హన్సిక స్నేహితులు కూడా ఎంతో గ్లామరస్ గా రెడీ అయ్యి వచ్చారు. అయితే హన్సికని వాళ్ళు డామినేట్ చేయలేకపోయారు.

ఇదిలా ఉండగా.. పెళ్ళైన తర్వాత హన్సిక సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే డౌట్ అందరిలోనూ ఉంది.ముఖ్యంగా ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు అనే చెప్పాలి. హన్సిక మాత్రం ఇంకా సినిమాల విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ బిజినెస్మెన్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా వరకు సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వాళ్ళే కావడం విశేషం.సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆ పార్టీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus