“చెత్త సినిమాలో మంచి పాత్ర చేయడంలో అర్థం ఏముంది? అవి నాకు వద్దు. ప్రేక్షకులు సినిమా అంతా బాగా ఎంజాయ్ చేయాలి. ధియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నా పాత్ర గుర్తు పెట్టుకుంటే చాలు” అంటోంది హన్సిక. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిందీ ముంబై సుందరి. ఇటీవల అగ్ర కథానాయకుల సినిమాల్లో తక్కువ కనిపిస్తుంది. ఎక్కువగా కొత్త కుర్రాళ్ల పక్కనే నటిస్తుంది.
సినిమాల ఎంపికపై స్పందిస్తూ.. ‘ప్రేక్షకులు తెలివైనోళ్ళు. ఏది మంచి చిత్రమో వాళ్లే నిర్ణయిస్తారు” అని చెప్పింది. ఇంకా హన్సిక మాట్లాడుతూ.. “నా సినిమాలు సరైన విజయం సాధించకుంటే.. నాకూ బాధగా ఉంటుంది. కానీ, ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తాను. ఎందుకంటే.. ఏ సినిమాకు మద్దతు ఇవ్వాలో వాళ్లకు తెలుసు. ప్రేక్షకులకు ఓ సినిమా నచ్చకుంటే.. మనం అంగీకరించవలసిందే. అందువల్ల, నేను మంచి సినిమాల్లో నటించడంపై దృష్టి పెట్టాను” అని వ్యాఖ్యానించింది.