పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈమె క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.కానీ తర్వాత వచ్చిన ‘కంత్రి’ ‘బిల్లా’ వంటి చిత్రాలు యావరేజ్ గానే ఆడాయి. అటు తర్వాత రామ్ తో చేసిన ‘మస్కా’ ‘కందిరీగ’, విష్ణు తో చేసిన ‘దేనికైనా రెడీ’, రవితేజ తో చేసిన ‘పవర్’ వంటి సినిమాలు హిట్ అయినా తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు.
కానీ తమిళంలో మాత్రం ఈమె స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. అక్కడి జనాలు ఈమెను జూనియర్ ఖుష్బూ గా భావించి గుడి కట్టించే వరకు వెళ్లారు. సినిమాలతో పాటు అక్కడ శింబు వంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపి ఈమె మరింత పాపులర్ అయ్యింది. కానీ అతనితో త్వరగానే బ్రేకప్ అయిపోయింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. హన్సిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది.
దాక్షిణాదికి చెందిన ఓ బడా పోలిటీషియన్ కొడుకు అలాగే బిజినెస్మెన్ తో హన్సిక ఏడడుగులు వేయబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని సమాచారం.అతి త్వరలో వీరి నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు వినికిడి. దీనిపై త్వరలోనే హన్సిక తన సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్లపై ఇలాంటి పెళ్లి వార్తలు రావడం కామన్, జనాలు కూడా అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మేలా ఇప్పుడు లేరు కాబట్టి.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?