శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా నుంచి కొందరు ఇప్పటికి కూడా బిగ్ స్క్రీన్ పై విభిన్నంగా ఆకట్టుకుంటున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల సినిమా ఆడిషన్స్ అంటేనే వేల మంది వస్తారు. అంటే వాళ్లకు కసి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయితే వాళ్ళంత బెస్ట్ అని చెప్పవచ్చు.
అయితే మరికొందరు మాత్రం కెరీర్ లో సరిగ్గా సెట్టవ్వలేదు. అంటే వాళ్లకు సెట్టయ్యే అవకశాలు రాలేదని చెప్పవచ్చు. ఇక ఎంత ఆలస్యం అయినా కూడా తనలో కసి చావలేదని హ్యాపీడేస్ టైజన్ రాహుల్ నిరూపిస్తున్నాడు. హ్యాపీడేస్ సినిమాలో బక్కోడా అనే పేరుతో పిలిపించుకున్న రాహుల్ ఇప్పుడు మాత్రం బాడీ బిల్డర్ లా మారిపోయాడు. అతని లుక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అసలు రాహుల్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తాడాని ఎవరు అనుకోలేదు.
హ్యాపీడేస్ అనంతరం కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. 4 ఏళ్ల క్రితం వెంకటాపురం అనే సినిమాతో కాస్త హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం 100క్రోర్స్ అని ఒక యాక్షన్ సినిమా అయితే చేస్తున్నాడు. మరి ఈ న్యూ లుక్ తో రాహుల్ ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.