విడాకులు తీసుకున్న హీరోయిన్ రంభ.. నిజమేనా..?

దివంగత స్టార్ డైరెక్టర్… ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రంభ. మొదటి చిత్రంతోనే తన గ్లామర్ తో అమితంగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.! నిజానికి ఈమె సొంత పేరు విజయలక్ష్మీ. అయితే అప్పటికే ఆ పేరుతో ఇండస్ట్రీలో చాలా మంది ఉండడంతో రంభగా పేరు మార్చుకుంది. తెలుగుతో పాటు.. తమిళం, హిందీ, భోజపురి,బెంగాలీ, తదితర భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. అన్ని భాషల్లోనూ కూడా రంభ క్రేజీ హీరోయిన్ గా రాణించింది.

రంభ, ఇంద్ర కుమార్ లకు.. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.. ఉన్నారు. ప్రస్తుతం రంభ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలో ఉన్న తన సొంత ఇంట్లో నివసిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే రంభకు మరియు ఆమె భర్తకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. రంభ భర్త అయిన ఇంద్రకుమార్.. పిల్లల కోసం ప్రతీ నెల డబ్బులు పంపిస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. వీళ్ళు విడాకులకు అప్లై చేసిన మాట నిజమే అయినప్పటికీ.. కోర్టు వీళ్ల విడాకులను మంజూరు చేయలేదట.

దాంతో వీళ్ళే సమస్యను పరిష్కరించుకొని కలిసి ఉంటున్నారట. కాబట్టి విడాకులు తీసుకోలేదని స్పష్టం అవుతుంది.ఇదిలా ఉండగా… రంభ కూడా పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ వస్తుంది. మరోపక్క సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రంభ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. 2007లో వచ్చిన రాజమౌళి-ఎన్టీఆర్ ల ‘యమదొంగ’ చిత్రంలో ‘నాచోరే నాచోరే’ పాటకు రంభ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus