Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). అసలు ఫినిష్ అవుతుందా? లేదా? అనే రోజుల నుండి మొత్తానికి మంచి బజ్ తో రిలీజ్ అయ్యే స్థాయికి ఈ సినిమా వచ్చింది. 5 ఏళ్ళ పాటు ఈ సినిమా సెట్స్ పై ఉంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయ్యింది. ఏ.ఎం.రత్నం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి నుండి ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Hari Hara Veera Mallu Review

కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ కామెంట్స్ ఆగాయి. అసలు ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించని బయ్యర్స్.. మొత్తానికి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి సినిమాని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. జూలై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. ప్రమోషన్స్ డోస్ కూడా పెంచారు.

తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం 2 గంటల 42 నిమిషాలు వచ్చింది. మరోపక్క ఈ చిత్రం చూసిన తర్వాత సెన్సార్ వారు టీంని ప్రశంసించారట.

సరైన టైంలో.. పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా పడుతుందని, సినిమాలో విజువల్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయని వారు అభిప్రాయపడినట్లు టాక్ నడుస్తుంది. అలాగే బయ్యర్స్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి బాక్సాఫీస్ దాహం తీర్చే సినిమా అవుతుంది అని భరోసాతో నిర్మాతకి అడ్వాన్సులు ఇచ్చి వెళ్లినట్టు టాక్ వినిపిస్తుంది.

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus