రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ లేరు. ఇది కొత్త విషయం కాదు కానీ.. ఎందుకు మిస్ అయ్యారు అనేది ఇప్పుడు కొత్త విషయం. అందుకే ఇప్పుడు ఈ టాపిక్ వైరల్‌గా మారింది. ఎందుకంటే రాజమౌళి తీసే విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమాలకు సెంథిల్ కుమార్ స్పెషలిస్ట్. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ సినిమాలు తీయడంలో దిట్ట అని పేరున్న వారిలో సెంథిల్ కుమార్ ఒకరు. జక్కన్న ‘సై’ సినిమా నుండి సెంథిల్ కుమార్ ఆయన కోటరీలోనే ఉన్నారు. రాజమౌళి తీసిన వరుస సినిమాలకు ఆయనే కెమెరా పని చూశారు. అయితే మధ్యలో ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ చేయలేదు.
ఇప్పుడు చర్చ ఏంటంటే.. మహేష్‌బాబు లాంటి అతి పెద్ద హీరోతో రాజమౌళి చేస్తున్న సినిమా టీమ్‌లో సెంథిల్ మిస్ అవ్వడం ఏంటి? ఎందుకంటే ఈ సినిమా కూడా విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమానే. ఈ విషయమే సెంథిల్ దగ్గర ప్రస్తావిస్తే.. అలా ఏమీ లేదు. ఇది మేమిద్దరం అనుకుని చేసింది. ఈ సినిమా కోసం రాజమౌళి కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. అందుకే పీఎస్ వినోద్ ఈ సారి కెమెరా అయ్యారు అని చెప్పారు సెంథిల్ కుమార్.
అయినా తమ మధ్య గతంలోనూ ఇలానే జరిగిందని, ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలు తామిద్దరం కలసి చేయలేదు. దీనికి ఎవరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మహేశ్ సినిమా తర్వాత మరో కథ కుదిరితే మళ్లీ నేను, రాజమౌళి కలసి పని చేస్తామని చెప్పారు. ఇక తాను ఓ సినిమా ఓకే చేసినప్పుడు కథ భావోద్వేగాలతో కలసి ప్రయాణిస్తుందా లేదా అనేది చూస్తాను. ఏ జానర్ కథ ఎంచుకున్నా నాకిదే ముఖ్యం అని చెప్పారు.
ఇక ‘బాహుబలి’ జానర్‌లోనే ‘స్వయంభూ’ సాగుతుందని, వేల ఏళ్ల క్రితం నాటి రాజుల కథతో సినిమా సిద్ధమవుతోందని చెప్పారు. ‘ది ఇండియన్ హౌస్’ స్వాతంత్య్రం పూర్వం జరిగే కథతో రూపొందుతోందని తెలిపారు. ఈ రెండు సినిమాల్లో హీరో నిఖిల్ అనే విషయం తెలిసిందే.