Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

గతేడాది ‘లాల్ సలాం’ అనే సినిమా వచ్చింది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా రజినీకాంత్ కీలక పాత్ర పోషించారు. సినిమాని మార్కెట్ చేసుకోవడానికి ఎక్కువగా రజినీ పేరునే వాడుకున్నారు. అది సహజం. కానీ మొదటి షోతోనే సినిమా ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.

Vishnu Vishal, Rajinikanth

కూతుర్ని డైరెక్టర్ గా నిలపడానికి రజినీ చేసిన త్యాగాన్ని అభిమానులు సైతం స్వాగతించలేదు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి విష్ణు విశాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ” ‘లాల్ సలాం’ సినిమాలో నేనే హీరో. మొదట నాకు కథ చెప్పినప్పుడు కూడా ‘మీరు హీరో’ అనే చెప్పారు. అలాగే రజినీకాంత్ గారిది 25 నిమిషాల కీలక పాత్ర అని చెప్పారు. సినిమా నాకు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే సెట్స్ పైకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ మారిపోయింది.

రజినీకాంత్ గారి పాత్ర గంటన్నరకు పెరిగింది. దీంతో అది రజినీ గారి సినిమా అయ్యింది. ప్రమోషన్ కూడా అలాగే జరిగింది. రజినీ సార్ సినిమాలో నేను కూడా భాగమైనందుకు నాకు సంతోషమే. కానీ ‘లాల్ సలాం’ రజినీకాంత్ గారి సినిమాగా ప్రచారమవ్వడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ తో థియేటర్లకు వచ్చారు.

కానీ సినిమాలో నేను హీరోగా కనిపించేసరికి వాళ్ళు డిజప్పాయింట్ అయ్యారు.సినిమా ప్లాప్ అయ్యింది. అది విష్ణు విశాల్ సినిమాగా భావించి వాళ్ళు థియేటర్ కి వస్తే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అలా జరగలేదు కాబట్టి.. నేను కూడా డిజప్పాయింట్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.

 హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus