పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఆమె ‘బద్రి’ ‘జానీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా. తర్వాత ఆమె తీసిన సినిమా క్లిక్ అవ్వకపోవడంతో.. బుల్లితెర పై పలు షోలలో సందడి చేస్తూ వచ్చింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే హడావిడి అందరికీ తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ ని గిల్లడం తర్వాత వారిపై మండి పడటం వంటివి కూడా ఈమెను వార్తల్లో నిలుపుతాయి. ఇదిలా ఉంటే.. ఆమె లేటెస్ట్ పోస్ట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
విషయం ఏంటంటే.. రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి ఓ సెల్ఫీ తీసుకుంది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో ‘ఫైనల్ గా నా సర్జరీ అనంతరం నా క్యూటీస్ తో పాటు బయట డిన్నర్ చేయడానికి వచ్చాను’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అంతా షాక్ కి గురయ్యారు. ఈ ఫోటోని కనుక గమనిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
ఇందులో రేణు దేశాయ్ ఫేస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దీంతో ఆమె ఫాలోవర్స్ లో కంగారు మొదలైంది. కానీ ఏ సర్జరీ చేయించుకుంది? ఆమె ఆరోగ్యం బాగానే ఉందా? ఫేస్ కి ఏమైనా సర్జరీ చేయించుకుందా? వంటి ప్రశ్నలకు మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. బహుశా నెక్స్ట్ స్టోరీలో ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.