బిగ్‌బాస్‌4: సిచ్యువేషన్‌ భలేగా వాడుకుంటున్న హారిక

Advertisement

బిగ్‌బాస్‌ ఇంట్లో ఎంటర్‌టైనర్లకే విలువ ఎక్కువ. ప్రేక్షకులు కూడా వాళ్లకే ఓటేస్తుంటారు. అలాంటివాళ్లు ఇంట్లో ఫైనల్‌ వరకు వెళ్తుంటారు. ఈ సీజన్‌లో అలా కనిపిస్తున్నవారిలో దేత్తడి హారిక ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా తను ఇంట్లో ఎందుకు పర్‌ఫెక్ట్‌ అనేది నిరూపిస్తూ ఉంటుంది. చిన్న సందర్భం దొరికినా తను ఎంజాయ్‌ చేస్తూ, ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటుంది.

ఎంత ఎదిగినా… తనలో చిన్నపిల్ల అప్పుడప్పుడు బయటకు వస్తుండటం హారికలో యూఎస్‌పీ. వర్షం చూసి చిందేయడం, చిలుకలతో ఆడుకోవడం, ఆకాశంలో విమానం చూసి మురిసిపోవడం… ఇలా ఒక్కటా రెండా. తాజాగా అలాంటిదే బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ అయిపోయాక అందరూ గార్డెన్‌ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈలోగా చిన్నగా చినుకులు పడుతుండటంతో దివి ఓ గొడుగేసుకొని వచ్చింది. అక్కడే పూల్‌ దగ్గర ఉన్న హారికతో మాట్లాడబోయింది.

ఇదేదో బాగుంది కదా అనుకుంటూ హారిక… అక్కడ టైటానిక్‌ సినిమాలోని ఐకానిక్‌ పోజు చేసింది. వెనుక నిల్చున్న దివి ‘జాక్‌’ అవ్వగా… ముందు నిల్చున్న హారిక ‘రోజ్‌’గా మారింది. పోజులో బెస్ట్‌ థింగ్‌ ఏంటంటే.. జాక్‌ను రోజ్‌ సరదాగా ముద్దు పెట్టుకోవడం. పైన గొడుగు.. ముందు పూల్‌.. భలే అనిపించింది తెలుసా ఆ టైటానిక్‌ పోజ్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus