Harish Shankar: అప్పుడు ఆ ఇద్దరూ చేశారు… ఇప్పుడు నేను చేస్తున్నాను: హరీశ్‌ శంకర్‌

Advertisement

టాలీవుడ్‌లో మాస్‌ దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ ఒకరు. అగ్ర హీరోలకు మాస్‌ సినిమాలు చేయాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు హరీశ్‌ శంకర్‌. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా చేస్తున్నారు. అయితే హరీశ్‌ శంకర్‌ ప్రస్తుతం నాన్‌ షూటింగ్‌ మోడ్‌లో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా ఆలస్యమవుతోంది. అయితే హరీశ్‌ శంకర్‌ మాత్రం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, ప్రెస్‌మీట్లకు వస్తుంటారు.

దీంతో కొంతమంది హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఎందుకు ఇలా అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నారు, ఏంటి కారణం అని అడుగుతుంటారు. దీనిపై తాజాగా హరీశ్‌ శంకర్‌ స్పందించారు. ఎవరైనా సినిమా ఫంక్షన్లకు తాను ఎందుకు వస్తున్నాను అనే విషయాన్ని వెల్లడించారు. అందరూ అనుకున్నట్లు తన స్నేహితులు, తెలిసిన వాళ్ల సినిమాలకే రాను అని, తనకు పెద్దగా తెలియనివాళ్లు పిలిచానా వెళ్తాను అని చెప్పుకొచ్చారు. దానికి కారణం కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడమే అని చెప్ఆపరు.

దర్శకుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో స్టార్‌ దర్శకులు పూరి జగన్నాథ్‌, వీవీ వినాయక్‌ లాంటివారు తనను ప్రోత్సహించారని హరీశ్‌ శంకర్‌ గుర్తు చేశారు. తన కొత్త రోజుల్లో తన సీనియర్స్‌ చేసినట్లే ఇప్పుడు… తానూ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘స్పార్క్: లైఫ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాలో నటించిన సుహాసిని గారు, మెహరీన్‌, రుక్సార్‌, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌, పాటల రచయిత అనంత శ్రీరామ్‌ తప్ప… ఇంకా ఎవరూ తనకు తెలియదని చెప్పారు. విక్రాంత్‌ హీరోగా నటిస్తూ, స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ‘స్పార్క్‌ లైఫ్‌’. ఈ సినిమా నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా బుడగ పెద్ద సినిమాలకు ఓకే కానీ, చిన్న సినిమాలకు ఇప్పటికే పగిలిపోయింది. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus