‘దురంధర్: ది రివెంజ్'(Dhurandhar: The Revenge) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మార్మోగుతోంది.
సినిమా రిలీజై వారం కూడా కాకముందే.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఆదిత్య ధర్ పై టాలీవుడ్ కన్ను పడినట్టు కూడా టాక్ నడుస్తోంది.
కోలీవుడ్ నుండి ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్’ సంస్థ ఇప్పటికే ఆదిత్య ధర్ ను అప్రోచ్ అయ్యి కొంత అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ లిస్టులో టాలీవుడ్ నుండి ‘మైత్రి మూవీ మేకర్స్’ కూడా రేసులో ఉన్నట్టు టాక్. మరోపక్క ఆదిత్య ధర్ తదుపరి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతోందంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. అయితే, దురంధర్ ఫ్రాంచైజీతో ఆయన చూపించిన టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు టాలీవుడ్ బడా హీరోలు సైతం ఫిదా అవుతున్నారు అనేది నిజం.
ఆదిత్యతో ఎలాగైనా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని మన తెలుగు స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఛాయిస్ పూర్తిగా డైరెక్టర్ చేతిలోనే ఉంది.కానీ, ఆదిత్య ధర్ మాత్రం ఎప్పటిలాగే ఏమాత్రం తొందరపడటం లేదు. వరుస సినిమాలతో బిజీ అవ్వకుండా.. ప్రస్తుతానికి ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్‌లో కొత్త స్క్రిప్ట్‌పై ప్రశాంతంగా కూర్చుని, కథ మొత్తం పూర్తయ్యాకే దానికి తగ్గ హీరోను ఫైనల్ చేస్తారట.
దానికి తోడు ‘దురంధర్ 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు.మరోవైపు డైరెక్షన్‌కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో రెండు సినిమాలు నిర్మించేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడైతే ఆదిత్య ధర్ కేవలం ‘దురంధర్ 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్‌మెంట్ రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని స్పష్టమవుతోంది.