Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) పై పగ తీర్చుకోవాలని ఉంది అంటున్నాడు ఓ తమిళ నటుడు. అతను మరెవరో కాదు పార్థీబన్. సోషల్ మీడియా వేదికగా అతను హరీష్ శంకర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

Harish Shankar

పార్తిబన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…”డైరెక్టర్ హరీష్ గారు.. ఇది నేను AP.. ! అంటే As it is ఉండే Parthiban ! not A.I.. అంకుల్ ఏజ్‌లో ఉండే నన్ను.. Anti aging చేసి వయసు తగ్గిస్తే పర్లేదు.. కానీ మీరు నన్ను మేకప్ సహాయంతో.. ఒక ముసలాడిలాగ చూపించడానికి ట్రై చేస్తున్నారు.. ఇది న్యాయమా..? విలన్ అంటే హీరో మీద కదా రివేంజ్ తీర్చుకుంటాడు..? కానీ నేను డైరెక్టర్ మీదే రివేంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాను.. నా నెక్స్ట్ సినిమా చూడండి..!

హ హ హ.. ఈ రోజే డబ్బింగ్ చెప్పాను.. మీకు, మైత్రి మూవీ మేకర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.. ఎందుకు అనేది.. రేపు సినిమా చూసిన ఆడియన్స్ చెప్తారు..” అంటూ రాసుకొచ్చాడు.పార్తిబన్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దర్శకుడు హరీష్ శంకర్ పై అతను ఫన్నీగా ఈ కామెంట్స్ చేశాడా? లేక సీరియస్ గా స్పందించాడా? అనే కన్ఫ్యూజన్ కొంత జనాలకి ఉంది. ఏదేమైనప్పటికి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఇతను మెయిన్ విలన్ అని స్పష్టమవుతుంది.

నల్లా నాగప్ప అనే పోలిటికల్ లీడర్ గా పార్థీబన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా.

90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus