Haromhara: సుధీర్ బాబుకి హోప్ ఇచ్చిన ‘హరోం హర’ టీజర్.. వర్కౌట్ అయితే..!

  • November 28, 2023 / 11:05 AM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు హీరో సుధీర్ బాబు. ఈ మధ్య ఆయనకు సరైన సక్సెస్ పడలేదు. ‘హంట్’ ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు అతని అంచనాలను తలక్రిందులు చేశాయి. అయితే త్వరలో ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.

కొన్ని గంటల ముందు ఈ సినిమా తెలుగు టీజర్ ను ప్రభాస్, మలయాళం టీజర్ ను మమ్ముట్టి, హిందీ టీజర్ ను టైగర్ ష్రాఫ్, తమిళ టీజర్ ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్ ను కిచ్చా సుదీప్‌లు లాంచ్ చేశారు. ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ అవతార్ లో సుధీర్ బాబు కనిపించాడు. రాయలసీమ స్లాంగ్ లో అతను పలికిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.సింక్ బాగా కుదిరింది.

అతని లుక్స్ లో చాలా కాన్ఫిడెన్స్ కన్పిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మాళవిక శర్మ సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. కచ్చితంగా ఈ ‘హరోం హర’ సుధీర్ బాబుని సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా (Haromhara) ఈ టీజర్ పై నెటిజన్లు డిస్కస్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus