‘అమృతం’ సీరియల్ తో అందరిళ్ళలో ఫ్యామిలీ మెంబెర్ అయిపోయాడు నటుడు హర్షవర్ధన్. అంతకు ముందు ఈయన ఎన్ని సినిమాల్లో నటించినా… ఆ సీరియల్ మాత్రమే ఈయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. తరువాత ఇతను స్క్రిప్ట్ రైటర్ గా కూడా పలు సినిమాలకు పనిచేసాడు. ‘మనం’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘గురు’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఇతను రైటర్ గా పనిచేసాడు. తాజాగా ఇతను సుధీర్ బాబుతో ఓ సినిమాని సెట్ చేసుకున్నాడు.
‘ఆసియన్ సినిమాస్ సంస్థ’ నిర్మాతలైన నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావ్ లు నిర్మాతలు. ఇదే నిర్మాతలు శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందించారు.మొన్ననే ధనుష్ తో కూడా ఓ సినిమాని సెట్ చేసారు. కాబట్టి హర్షవర్ధన్ కు ఇది మంచి అవకాశమే.అయితే అతనికి ఇది మొదటి సినిమా కాదు. అంతకు ముందే ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. శ్రీముఖి, మురళీ కృష్ణలు హీరో హీరోయిన్లుగా నటించారు.
టీజర్, ట్రైలర్ లు కూడా విడుదలయ్యాయి. కానీ కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ కాలేదు.అంతేకాదు ఈ సినిమా బాగా రాలేదు అనే టాక్ కూడా నడిచింది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లు తెరుచుకున్న వెంటనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అలా జరిగితే హర్షవర్ధన్ నెక్స్ట్ మూవీకి దెబ్బ పడినట్టే. అందుకే హర్షవర్ధన్ కూడా టెన్షన్ పడుతున్నట్టు వినికిడి.