మెగా కాంపౌండ్ లో మరో హీరోయిన్!!
- March 17, 2016 / 01:18 PM ISTByFilmy Focus
ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నిఖిల్ సరసన, బెక్కం వేణు గోపాల్ నిర్మించనున్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో, రాజ్ తరుణ్ తదుపరి చిత్రంలో ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హెబా పటేల్.. మెగా హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ఇదివరకే లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయగా.. తాజాగా హెబా పటేల్ ను కూడా ఎంపిక చేసినట్లు నిర్మాత నల్లమలపు బుజ్జి తెలియజేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుండగా.. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు.
అసలే మాంచి ఊపు మీదున్న హెబ్బాకు, ఈ మెగా ఆఫర్ మరింత స్టార్ డమ్ తెచ్చిపెట్టడం ఖాయం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













