Pushpa 2 : ఆ సమయానికే పుష్ప2 సినిమా పనులు పూర్తవుతాయట.. కానీ?

Advertisement

బన్నీ (Allu Arjun) సుకుమార్  (Sukumar)  కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో తెరకెక్కిన ఆర్య (Aarya) , ఆర్య2 (Aarya2) , పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule)   మూవీ ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడటంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు డిసెంబర్ లో విడుదలవుతాయని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అయితే ఆగష్టు నెలాఖరు సమయానికే పుష్ప ది రూల్ షూట్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత నిదానంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆగష్టు 15 తర్వాత పర్ఫెక్ట్ డేట్ దొరకక ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో దేవర రిలీజ్ కానుండటం, అక్టోబర్ లో పలు సినిమాలతో పోటీ ఉండటం, నవంబర్ పెద్ద సినిమాలకు అనుకూలమైన నెల కాకపోవడంతో పుష్ప మేకర్స్ డిసెంబర్ నెలపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ మూవీ 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా ఇతర భాషల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ గత సినిమాలు సక్సెస్ సాధించడంతో భవిష్యత్తు సినిమాలు సైతం హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా బన్నీ ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus