ఘనంగా ఆది సాయి కుమార్ మరదలి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఆది సాయి కుమార్ అందరికీ సుపరిచితమే.సీనియర్ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్.. అయిన సాయి కుమార్ గారి కొడుకు. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆది.. తొలి సినిమా ‘ప్రేమ కావాలి’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘లవ్లీ ‘ అనే సినిమా కూడా హిట్ అవ్వడంతో ఆది ప్రామిసింగ్ హీరో అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అదే టైంలో అతనికి మాస్ హీరోగా ఎదగాలి అనిపించింది.

ఈ క్రమంలో ‘సుకుమారుడు’ ‘రఫ్’ అంటూ ఏంటేంటో యాక్షన్ సినిమాలు చేసి ఉన్న మార్కెట్ ను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క హిట్ కోసం అతను పడని తిప్పలు అంటూ లేవు. కుర్రాడిలో టాలెంట్ ఉంది. డాన్స్, ఫైట్స్.. బాగా చేస్తాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. కానీ అతని ఇమేజ్ కి సరిపడా కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవడంలో తడబడుతున్నాడు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..

రాజమండ్రికి చెందిన అమ్మాయి అరుణతో ఆది సాయి కుమార్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 2014 లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకి అయానా అనే ఓ పాప కూడా ఉంది. అయితే ఇటీవల అరుణ సోదరి అంటే ఆది మరదలు అయిన మాధురి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో (Aadi Saikumar) ఆది- అరుణ ల కూతురు అయానా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus