Ajith: తల్లి కష్టాన్ని చూసి చలించి పోయిన అజిత్.. ఏం చేశారంటే?

  • April 15, 2023 / 02:25 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు కేవలం తెరపై మాత్రమే హీరోయిన్ చూపిస్తూ ఉంటారని చాలామంది భావిస్తుంటారు. అయితే బయట కూడా కొన్నిసార్లు వారు తమ మంచి మనసును చాటుకుంటారు. తాజాగా హీరో అజిత్ ఓ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి ఆయన చేసిన పని తెలిసే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే… గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ఓ మహిళ 10 నెలల బాబుని ఎత్తుకొని మరోవైపు రెండు బ్యాగులను మోస్తూ కనిపించారు.

అయితే ఆమెను చూసినటువంటి అజిత్ స్వయంగా తన దగ్గరకు వెళ్లి తనకు సహాయం చేశారని ఆ మహిళ భర్త ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఆ మహిళ కష్టాన్ని చూసి చలించిన అజిత్ ఆమె దగ్గరకు వెళ్లి బేబీ బ్యాగ్ తీసుకొని విమానం వచ్చేవరకు బేబీని ఎత్తుకొని నిలబడ్డారని తెలిపారు. అప్పటికి ఆమె వద్దని చెబుతున్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అజిత్ స్వయంగా బాబుని ఎత్తుకొని నిలబడ్డారని ఆయన తెలియజేశారు.

విమానం వచ్చిన తర్వాత ఆ బ్యాగును తన క్యాబిన్ వద్ద పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఇక ఆయనతో పాటు వచ్చిన ఓ వ్యక్తి తలైవా మీరు ఎందుకు మోయటం నేను తీసుకు వస్తానని చెప్పిన అజిత్ వినలేదని తెలిపారు. విమానం దగ్గరకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూడా తన భార్య బ్యాగులను అజిత్ తీసుకున్నారని తెలిపారు.

అంత గొప్ప స్టార్ అయిండుకొని ఇలా సింపుల్ గా వ్యవహరించడం చాలా గ్రేట్ అంటూ, (Ajith) అజిత్ మనసు ఎంతో గొప్పది అంటూ ఆ వ్యక్తి అజిత్ గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అజిత్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus