తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయి కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందో.. తమిళంలో అజిత్ కూ అదే స్థాయిలో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. మాస్ హీరోగా ఆయన సినిమాలన్నీ కోలీవుడ్ లో సూపర్ హిట్లే. పవన్ తరహాలోనే.. సినిమాలు ఫ్లాపైనా ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరని స్టార్ డమ్ అజిత్ ది. అయితే.. ఒకప్పుడు అజిత్ లవర్ బాయ్ గా ఉండేవాడు. ఆయన నటించిన ప్రేమకథా సినిమాలన్నీ అద్భుతంగా ఆడాయి. తెలుగులో ప్రేమ లేఖ సినిమా ఏ స్థాయిలో హిట్టైందో మన ప్రేక్షకులకూ తెలుసు. ఆ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న టైమ్ లోనే అజిత్ హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ ను ప్రేమించాడు.
ఆరోజుల్లోనే వీరిద్దరి లవ్ స్టోరీపై కోలీవుడ్ లో చర్చలు జరుగుతుండేవి. అజిత్ హీరాకు ప్రేమలేఖలు కూడా రాయడం విశేషం. చాలామందికి తెలియని ఈ ప్రేమకథను నటుడు బయిల్వాన్ రంగనాథన్ బయటపెట్టారు. అజిత్ రాసిన ప్రేమలేఖల్లో ఒకదాన్ని తాను చదివానని ఆయన చెప్పడంతో అజిత్ తొలిప్రేమ బయటపడింది. కాదల్ కొట్టై అనేది అజిత్, హీరాల కాంబోలో తొలి సినిమా. ఆ ఒక్క సినిమాకే అజిత్ హీరాను చూసి ఫ్లాటైపోయారట. ఆ తర్వాత మరో సినిమా తోడారమ్ లోనూ జంటగా నటించారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రేమ తర్వాతి దశకు చేరుకోలేకపోయింది.
పెళ్లితో ఒక్కటవ్వాల్సిన వీరిద్దరూ ఎవరి దారిన వారు సాగిపోయారు. అందుకు కారణమేంటా అని ఆరా తీస్తే.. తన కూతురి కెరీర్ గురించి భయపడి హీరా తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి అజిత్ షాలిని ప్రేమతో బయటపడ్డారు. అనంతరం వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటై ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. అదండీ.. నేటి సూపర్ స్టార్, ఒకప్పటి లవర్ బాయ్ తలా అజిత్ సీక్రెట్ లవ్ స్టోరీ.