టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో జయం ఒకటి. ఆ సినిమా సక్సెస్ తో డైరెక్టర్ తేజ కెరీర్ తో పాటు నటీనటుల క్రేజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. నితిన్ హీరోగా బిజీ అవ్వగా కొన్ని రోజులు గోపీచంద్ విలన్ గా బిజీ అయ్యాడు. అనంతరం మళ్ళీ గోపీచంద్ హీరోగా యూ టర్న్ తీసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్నాడు. అయితే చాలా రోజుల తరువాత మళ్ళీ జయం కాంబినేషన్ సెట్టయ్యింది.
నిజం అనంతరం దాదాపు 18 ఏళ్ళ అనంతరం తేజ దర్శకత్వంలో సినిమా చేయడానికి గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్క్రిప్ట్ విషయంలో గోపి మరోసారి చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. డిస్కషన్ అనంతరం ప్రాజెక్టు క్యాన్సిల్ అనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగానే వస్తోంది. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా డైరెక్టర్ తేజ గాని హీరో గోపిచంద్ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
సినిమాకు అలివేలు వెంకటరమణ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు తేజ తన బర్త్ డే రోజు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సడన్ గా ప్రాజెక్టు క్యాన్సిల్ అని టాక్ రావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.