ఘనంగా యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • October 28, 2022 / 05:33 PM IST

సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. రీసెంట్‌గా నటి పూర్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఓ బిజినెస్‌మెన్‌తో దుబాయ్‌లో పూర్ణ ఏడడుగులేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు మరో యువ నటుడు కూడా మ్యారేజ్ చేసకున్నాడనే వార్త ఫిలింసర్కిల్స్‌లో, మీడియాలో చక్కర్లు కొడుతోంది. హరీష్ కళ్యాణ్.. కోలీవుడ్‌కి యంగ్ హీరోల్లో తనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..తమిళ్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌లో పార్టిసిపెట్ చేసిన హరీష్..

తర్వాత ‘సింధు సమవేలి’ మూవీతో యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తక్కువ టైంలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘ఇస్పడే రాజవుం ఇదయ రాణియుం’ సినిమాలు తనకి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. కొద్దిరోజుల క్రితం నర్మద ఉదయ్ కుమార్‌తో తనకు నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు హరీష్. కాగా శుక్రవారం (అక్టోబర్ 28) చెన్నైలోని జీపీఎస్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

అప్పట్లో వీరిది లవ్ మ్యారేజ్ అని వార్తలు రావడంతో.. వాటిని ఖండిస్తూ తమది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని కన్ఫమ్ చేశాడు. ఆయన వైఫ్ నర్మదా విషయానికొస్తే.. తనకి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకి చెందిన యువ పారిశ్రామికవేత్త అయిన నర్మదా.. ‘క్లిక్ డిజైన్స్’, ‘దిస్ ఈజ్ హెర్’ అనే రెండు సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. తెలుగులో ‘కాదలి’ అనే మూవీలో హీరోగా నటించాడు కానీ, నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ తోనే సాలిడ్ రికగ్నైజేషన్ వచ్చింది.

ఆ మూవీలో యంగ్ నానిగా కనిపించి ఆకట్టుకున్నాడు హరీష్. ప్రస్తుతం తను నటిస్తున్న ‘స్టార్’, ‘డీజిల్’ ఫిల్మ్స్ తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ కానున్నాయి. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు హరీష్, నర్మద దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus