Hero Nani: అలా జరిగితే అడివి శేష్ రేంజ్ మారుతుందా?

  • July 25, 2022 / 01:53 PM IST

భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న హీరోలలో అడివి శేష్ ఒకరు. గత కొన్నేళ్లుగా అడివి శేష్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. కొత్తదనం ఉన్న కథలకు ఓటేస్తున్న అడివి శేష్ గత నెలలో విడుదలైన మేజర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మేజర్ సినిమా నిర్మాతలలో మహేష్ బాబు కూడా ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిట్2 మూవీలో అడివి శేష్ నటిస్తుండగా నాని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

2020 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన హిట్ సినిమాకు సీక్వెల్ గా హిట్2 తెరకెక్కుతోంది. అయితే హిట్2 చివరి షెడ్యూల్ అడివి శేష్ వల్ల ఆలస్యమైంది. హిట్2 చివరి షెడ్యూల్ గురించి అడివి శేష్ స్పందిస్తూ మేజర్ మూవీ సక్సెస్ ను అందించిన మీ అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సినిమా ప్రయాణం నాకెన్నో మధుర జ్ఞాపకాలను అందించిందని ఆయన చెప్పుకొచ్చారు. మేజర్ మూవీ రిలీజ్ తర్వాత హిట్2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని

కానీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లాలని నేను ఎంతగానో శ్రమించానని అడివి శేష్ తెలిపారు. అందువల్ల మానసికంగా శారీరకంగా అలసిపోయానని అడివి శేష్ చెప్పుకొచ్చారు. చిన్న బ్రేక్ తీసుకుని షూటింగ్ లో పాల్గొంటానని నాని, డైరెక్టర్ శైలేష్ కొలనును కోరానని అడివి శేష్ పేర్కొన్నారు. ఆగష్టు నెలలో హిట్2 మూవీ ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టి ఆఖరి షెడ్యూల్ పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తామని అడివి శేష్ చెప్పుకొచ్చారు.

నిర్మాతగా మహేష్ కు హిట్ ఇచ్చిన అడివి శేష్ నానికి కూడా హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. అడివి శేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు అడివి శేష్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. హిట్2 సక్సెస్ సాధిస్తే అడవిశేష్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus