Nani: భవిష్యత్తు సినిమాల విషయంలో నాని ప్లానింగ్ అలా ఉండనుందా?

  • July 27, 2023 / 06:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ప్రస్తుతం నాని హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో సరికొత్త కథాంశంతో హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ ఒకింత హద్దులు దాటుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాతో నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నాని ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే క్లాస్ సినిమాలకు నాని రేంజ్ సినిమాల బడ్జెట్లు వర్కౌట్ కావడం సులువు కాదనే సంగతి తెలిసిందే. క్లాస్ సినిమాలు హిట్టైనా మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లు రావు. ఈ రీజన్ వల్లే భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మాస్ ఆడియన్స్ కు నచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

తన సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. నాని రేంజ్ మరింత పెరగాలని నానికి మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాని కెరీర్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్నారు. హాయ్ నాన్న సినిమాతో నాని మరో హిట్ సాధిస్తారేమో చూడాలి. ఈ ఏడాది క్రిస్మస్ కు గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాలి.

నాన్న ఇతర భాషల్లో సైతం పాపులారిటీని పెంచుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కథ నచ్చితే మల్టీస్టారర్ లో నటించడానికి కూడా నాని (Nani) సిద్ధంగా ఉన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus