Nani Remuneration: దసరా సినిమా తరువాత రెమ్యునరేషన్ పెంచిన నాని!

  • April 12, 2023 / 08:12 PM IST

దసరా’ సినిమా విజయం తరువాత నాని తన పారితోషికాన్ని పెంచడాన్ని పరిశ్రమలో వినపడుతోంది. అయితే అతను ఎంత పెంచాడో తెలిస్తే షాక్ అవుతారు దసరా’ సినిమా విజయం తరువాత నాని తన పారితోషికాన్ని పెంచడాన్ని పరిశ్రమలో వినపడుతోంది. అయితే అతను ఎంత పెంచాడో తెలిస్తే షాక్ అవుతారు అగ్రనటులు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అని వార్తలు చదువుతున్నాం కదా. అందులో చాలామంది 100 కోట్లకు పైగా కూడా తీసుకుంటున్న వాళ్ళు వున్నారు.

ఇలా అగ్ర నటులు కాకుండా సెకండ్ బ్యాచ్ లో వచ్చే నటులు (Nani)నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, నితిన్, రామ్ పోతినేని లాంటి వాళ్ళు వున్నారు, వీళ్ళు కూడా సినిమా విజయం సాధిస్తే అది ఎంత రెవిన్యూ జనరేట్ చేసిన దాన్ని బట్టి పారితోషికాలు పెంచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నాని నటించిన ‘దసరా’ సినిమా విడుదల అయింది. ఇది నాని కెరీర్ లో పెద్ద సినిమా అని అంటున్నారు. ఈ సినిమాకి నాని సుమారు రూ.16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్టుగా పరిశ్రమలో అంటున్నారు.

అయితే ఈ సినిమా విజయం సాధించాక, నాని తన పారితోషికాన్ని మళ్ళీ పెంచాడని ఒక టాక్ నడుస్తోంది. ఇప్పుడు నాని తన తదుపరి సినిమాకి సుమారు రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు పరిశ్రమలో వినపడుతోంది. తన సినిమాలు పాన్ ఇండియా పరిధిలో విడుదల అవుతున్నాయని, అన్ని సినిమాలు ఓ.టి.టి, అలాగే శాటిలైట్ హక్కులు కి కూడా మంచి డిమాండ్ ఉండటంతో పారితోషికం పెంచడంలో తప్పు లేదన్నట్టుగా టాక్ నడుస్తోంది.

నాని ఒక డిమాండ్ లో వున్న నటుల్లో ఒకడు. అతని సినిమాలు టాక్ ఎలా వున్నా నిర్మాత పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అని కూడా పరిశ్రమలో అంటున్నారు. అలాంటప్పుడు నాని తో సినిమాలు చెయ్యడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. అదీ కాకుండా నాని తొందరగా కూడా సినిమా పూర్తి చేస్తాడు. వీటన్నిటివల్లా అతను బాగా డిమాండ్ లో వున్నాడు. అందువల్ల పారితోషికం పెంచాడు అని కూడా వినిపిస్తోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus