నేచురల్ స్టార్ నాని.. హీరోగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు.. అక్క దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ‘మీట్ క్యూట్’ అనే ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ నిర్మించాడు. అలాగే శైలేష్ కొలనుని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ‘హిట్ – ది ఫస్ట్ కేస్’ అనే సాలిడ్ థ్రిల్లర్ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో మరో 7 సినిమాల వరకు రానున్నాయని సమాచారం.. మల్టీ టాలెంటెడ్ అడివి శేష్ హీరోగా తీసిన ‘హిట్ 2 – ది సెకండ్ కేస్’ డిసెంబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది..
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ప్రొడ్యూస్ చేశారు. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడమే కాక మూవీ మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి.. ఇటీవల ‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అతిథులుగా విచ్చేశారు. జక్కన్న మాట్లాడుతూ.. హిట్ సిరీస్‌ను ప్రతి సంవత్సరం ఒకే సీజన్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేయాలని..
ఇలా చేయడం ద్వారా ఆ సీజన్ హిట్ మూవీ సీజన్ అని ప్రేక్షకులకు సైతం తెలుస్తుందని చెప్పడంతో అంచనాలు ఆకాశాన్నంటేశాయి.. ‘హిట్ 2’ క్లైమాక్స్‌లో ‘హిట్ 3’ లో నటించే హీరోకు సంబంధించిన క్లారిటీ వస్తుందని ఇప్పటికే చెప్పారు టీం.. ఇక ఈ కార్యక్రమంలో నాని స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఇటీవలే అయ్యప్పమాల వేసుకున్న నాని.. తండ్రి, తనయుడితో కలిసి దీక్ష పూర్తి చేశాడు.. నేచురల్ స్టార్ జియో మెట్రిక్ జాక్వార్డ్ స్వెటర్ వేసుకుని వచ్చాడు.
పాపులర్ జరా బ్రాండ్‌కి చెందిన స్వెట్ టీషర్ట్ నానికి బాగా సూట్ అయింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ దీని గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్వెటర్ కాస్ట్ రూ. 4,071.. ‘‘మిగతా సెలబ్రిటీలంత కాస్ట్లీ కాకపోయినా సింపుల్‌గా బాగుంది.. అందుకే నానిని నేచురల్ స్టార్ అనేది’’.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..