‘కార్తికేయ2’ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకుంది!

  • July 26, 2022 / 05:34 PM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ సినిమాను ముందుగా జూలై 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి ‘థాంక్యూ’ రిలీజ్ ఉండడంతో నిర్మాత దిల్ రాజు.. నిఖిల్ అండ్ టీమ్ ను కన్విన్స్ చేసి ‘కార్తికేయ2’ని వాయిదా వేసేలా చేశారు. ఇలా చేయడం ఎంత పెద్ద పొరపాటు అయిందో కార్తికేయ టీమ్ కి అర్ధమవుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘థాంక్యూ’ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. చాలా చోట్ల షోని క్యాన్సిల్ చేయాలనుకున్నారు. వీకెండ్ తో కలిసి కనీసపు షేర్స్ ను రాబట్టలేకపోయింది ఈ సినిమా.

నెగెటివ్ టాక్ రావడంతో థియేటర్ కు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. ఈ సినిమాతో పాటు విడుదలైన బాలీవుడ్ సినిమా ‘శంషేరా’ డిజాస్టర్ గా మిగిలింది. వందల కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమాకి కనీసపు కలెక్షన్స్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల థియేటర్ల అద్దె కూడా వసూలు కావడం లేదు. ఇక గత వారం వచ్చిన సినిమాల సంగతి సరేసరి. థియేటర్లో ఒక్క సరైన సినిమా కూడా లేకపోవడంతో జనాలకు ఆప్షన్ లేకుండా పోయింది.

‘కార్తికేయ2’ లాంటి బజ్ ఉన్న సినిమా గనుక ఇప్పుడు రిలీజై ఉంటే మరోలా ఉండేది. నిజం చెప్పాలంటే.. మంచి గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్లేనని చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు 12న ‘కార్తికేయ2’ సినిమాకి పోటీగా క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ముందు రోజు ‘లాల్ సింగ్ చద్దా’, ఆగస్టు 12న ‘మాచర్ల నియోజకవర్గం’ లాంటి సినిమాలు సందడి చేయబోతున్నాయి.

ఈ సినిమాలకు మెల్లమెల్లగా బజ్ పెరిగిపోతుంది. ఈ సినిమాలతో పోటీ అంటే ‘కార్తికేయ2’ టీమ్ వెరైటీగా ప్రమోషన్స్ చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి. మరి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus