Raj Tarun Reacts on Allegations: లావణ్య నిజస్వరూపం బయటపెట్టిన రాజ్ తరుణ్.. అలాంటి అమ్మాయంటూ?

Advertisement

ఈరోజు ఉదయం నుంచి రాజ్ తరుణ్ (Raj Tarun) లావణ్య అనే యువతిని మోసం చేశాడంటూ ఒక వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ తో మాట్లాడిన రాజ్ తరుణ్ మొదట్లో లావణ్య నేను కలిసున్న మాట వాస్తవమే గత కొన్నేళ్లుగా ఆమెతో ఎలాంటి రిలేషన్ షిప్ లేదని వెల్లడించారు. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో ఆమె నన్ను గైడ్ చేసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మేము రెండు మూడేళ్లు కలిసి ఉన్నామని అయితే తన అలవాట్లు నాకు నచ్చేవి కావని రాజ్ తరుణ్ వెల్లడించారు.

నేను పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతోందని ఆ మాట పచ్చి అబద్ధం అని ఆయన అన్నారు. నేను అసలు పెళ్లే చేసుకోలేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యతో రిలేషన్ షిప్ లో ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. డబ్బు కోసం ఆమె నన్ను బెదిరిస్తోందని రాజ్ తరుణ్ అన్నారు.

గతంలో చాలా సందర్భాల్లో లావణ్యకు డబ్బు సహాయం చేశానని తాజాగా 20,000 రూపాయల కోసం ఆమె తమ్ముడితో ఫోన్ చేయించగా నేను రియాక్ట్ కాకపోవడంతో ఆమె నా గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ అన్నారు. మాల్వీ మల్హోత్రా నాకు ఫ్రెండ్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను, మాల్వీ మల్హోత్రా కుటుంబ సభ్యులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాజ్ తరుణ్ తెలిపారు.

లావణ్యపై బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. నా రెప్యుటేషన్ దెబ్బ తింటుందని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని ఆయన తెలిపారు. పెళ్లి చేసుకుంటానని లావణ్యకు ఎప్పుడూ చెప్పలేదనిరాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. లావణ్యకు షాకిచ్చే విధంగా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. త్వరలో తన సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో లావణ్య ఇబ్బందులు పెడుతోందని రాజ్ తరుణ్ అభిప్రాయపడ్డారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus