యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొత్తగా ‘శేఖర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అందులో ఒక నాయికగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ ముస్కాన్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తాజాగా మరో హీరోయిన్‌ను కూడా ఖరారు చేశారట. ఈ మేరకు మలయాళం కథానాయిక అను సితారను ఎంచుకున్నారట. అను సితారకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ‘శేఖర్’ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ఒక పోస్టర్ మాత్రమే.
అందులో రాజశేఖర్ తెల్లటి గెడ్డంతో డిఫరెంట్‌గా కనిపించారు. అది చూస్తుంటే ఇదేమంత సాధారణ సినిమా కాదని అర్థమవుతోంది. మరి యువ దర్శకుడు లలిత్‌ను రాజశేఖర్‌ను ‘శేఖర్’గా ఎలా చూపించబోతున్నారనేది చూడాలి. ఈ సినిమాను ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి నిర్మిస్తున్నారు. రాజశేఖర్ 91వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదలవ్వాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, రాజశేఖర్‌కు కరోనా రావడం లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా మరోసారి చిత్రబృందం చిత్రీకరణకు సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కుదుటపడటంతో త్వరలో తెలుగులోనూ చిత్రీకరణలు మొదలవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్ అండ్ టీమ్ కూడా రెడీ అవుతోందట.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!